Wednesday 19 September 2012
Telugue desam party-paadayatra
2006 లో జరిగిన సంఘటన :
రామమ్మ : ఏమ్మమ్మ లచ్చమ్మ అంత ఆనందం గా ఉన్నావ్....!
లచ్చమ్మ: ఈ రోజు నాకు పండగ లాంటి రోజు అమ్మ
రామమ్మ: ఎందుకు ఏమిటి?
లచ్చమ్మ: నా కొడుకు శీనుని ఇంజనీరింగ్ లో చేర్పించి వచినా,, ఆడు పెద్ద ఇంజనీర్ అయ్యి పెద్ద ఉద్యోగం తేచుకుంటే మాకు ఈ కష్టాలు అన్ని తీరిపోతాయి. అంటూ ఆనంద బాస్పలు కారుస్తూ చెపింది..
రామమ్మ : అట్టగా...! బాగా చదివించు అమ్మ అడైన పెద్ద చదువు చదవి నీ కష్టాలు అన్ని తిరుస్తాడు.
(ఇది లచ్చం కే కాదు మన రాష్ట్రం లో చాల మంది తలి తండ్రుల సంగతి , ఎందుకంటే ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదవు చదవితే ఎవ్వరికైనా సొంతసమే, ఆ కుటంబం కస్థాల ఉబి నుండి వచ్చి కడుపు నిండా పట్టెడు మెతుకులు తింటారు)
2012: శీను తన ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకున్నాడు
ఏమమ్మ లచమ్మ శీను గాడు సదువు అయిపోయినాది అట కదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడా..!
లచ్చమ్మ: లేదమ్మా...! ఇంజనీరింగ్ సదువు కి ఉద్యోగాలు రావట్లేదు అట అమ్మ ... మన రాష్ట్రం లో అసలు ఇంజనీరింగ్ కి విలువ లేదు అట అమ్మ ... కొత్త కంపనీ లు కూడా రాలేదు అట అమ్మ ...!
(ఇంజనీరింగ్ చదివిన శీను పరిస్తేతే ఇలా ఉంటె మిగతా చదువులు చదివిన వారి పరిస్థతి చెప్పకర్లేదు)
ఇది ఇప్పుడు మాట ... మన రాష్ట్రం లో 95% పిల్లలుకి ఉద్యోగాలు రావట్లేదు.. ఇది ఎవరి తప్పు...
పాలకులదా.
విధ్యర్దులదా .. ఎవరిదీ అంటే పాలుకులుదే అని చెప్పాలి(విద్యార్ధి ఎప్పుడు కూడా తనకి కావల్సన మౌలిక వసతులు కలిపిస్తే అద్బుతాలు చేస్తారు,, అందులోకి మన తెలుగు గడ్డ సరస్వతి నేలకున్న నేల)
మన రాజ్యాంగం పిల్లలికి నాణ్యమైన విద్య అందించాలి అని చెప్తుంటే , మన స్వార్ధ పూరితమైన కొందరు పాలుకులు కేవలం వోట్ల కోసం తమ రాజకీయ క్రీడా లో చాలా మంది శీనులును బలి పశువు లును చేసారు.
పిల్లలు కాలేజీ లో జాయిన్ అయినప్పుడు వారి చదవు కి కావాల్సిన మౌలిక సౌకర్యాలు అందిస్తునమ లేదా, వారు చదవు పూర్తి చేసుకునేతప్పడకి తగిన ఉపాధి అవకాశాలు కలిపిస్తున్నామా లేదా అని చూడకుండా కేవలం వోట్ల కోసం అమాయకులైన ప్రజల తో ఆడుకుంటున్నారు..
ప్రభుత్వం ఒక పధకం పెట్టి దాని ద్వారా వోట్లు పొంది.. అధికారం లో కి వచ్చిన తర్వాత వారి కి సరిపడా ఉపాది అవకశాలు చూపించాలి, ఉపాధి అవకాశ నైపుణ్యాలు నేర్పాలి అది కనీసం పాలుకులు బాద్యత. ఆలా చేస్తే ఆ విద్యార్ధి తన కాల మిధ తను నిలబడి ఆ కుటంబంని అబివృద్ది బాట లో నడిపిస్తాడు అలా అయితే గాంధి గారు కళలు కన్నా ఆర్ధిక వికేంద్రికర్ణ జరిగి దేశం అబివృద్ది బాటలో నడుస్తుంది. కాని ఆ పధకం పెట్టిన వారి ఉద్దేశం వేరే అయ్యి ఉంటుంది, ఆ వ్యక్తి సొంత కాల మిధ నిలిబడతె వీరి ఆటలు సాగవు కదా...! మల్లి శీను గాడు ప్రుభుత్వం ఇచే సాయం కోసం చూడాలి , శీను కుటుంబం పేదరికం లో మగ్గి పోవాలి అప్పుడు ఇంకో పధకం పెట్టి శీను చేత వోట్లు వేయుంచుకుని తరతరలును బిచ్చాగాలును చేసి వీరు అధికారం లో ఉండవచు, అలంటి పరిపాలన కాదు మనకి కావాల్సింది ప్రజలును సొంత కాల మిధ నిలబెట్టి, వారిని రేపటి వెలుగు వైపు నేటి అంధకార పోరలు ను చింపుతూ, ఉజ్వల భవిస్యత్తుకు బాటలు వేసే నడిపే నాయకుడు కావాలి, పెట్టె ప్రతి పధకం ప్రపంచం లో మన దేశాన్ని అబివృద్ది పధం వైపు నడపాలి. ఆంధ్ర ప్రదేశ్ ని స్వర్ణాంద్ర ప్రదేశ్ చేయాలి..
రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. చేయి చేయి కలుపుదాం సునామి సృష్టించి ప్రజల బావోద్వేగాల తో , ప్రజల అమాయకత్వం తో, అవినీతి సొమ్ము తో, కులం తో, మతం తో అధికారం లో కి రావాలి అనుకునే వారిని ఆటలు కట్టిద్దాం, నిజమైన ప్రజాస్వామ్యాన్ని, మన స్వతంత్ర వీరుల ఆశయాల తో నవ శకాన్ని నిర్మిద్దాం..
అవినీతి లేని సమాజం కోసం
అకృత్యాలు లేని సమాజం కోసం
ఆర్ధిక అసమానతలు లేని సమాజం కోసం
మన రాష్ట్రం ను స్వర్గసీమల మార్చే పాలన కోసం చంద్రబాబు నాయుడు తో నడుద్దాం..
Subscribe to:
Posts (Atom)